Nepal-Tibet: నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం..! 1 d ago
హిమాలయ దేశాలు నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో, మంగళవారం ఉదయం 6.35 గంటలకు 7.1 తీవ్రతతో పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా టిబెట్‌లో ప్రస్తుతం కనీసం 53 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా నివేదించింది. 62 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు. సరిహద్దుకు 93 కిమీ దూరంలో లబుచె ప్రాంతంలో సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.